BHPL: గోరికొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గుడుంబా విక్రయాలు అరాచకంగా సాగుతున్నాయి. ఈ మద్య వ్యసనానికి బానిసలై పురుషులు ఆరోగ్యం పాడుచేసుకోవడమే కాకుండా, కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని యువత, మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడుంబా తయారీ, విక్రయ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు తక్షణమే దాడులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.