NGKL: కల్వకుర్తి మండలం చంద్రయాన్ పల్లి గ్రామ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని సర్పంచ్ చిలికేశ్వరం శంకర్ హైదరాబాద్లో కలిశారు. శేరి అప్పారెడ్డి పల్లి రోడ్డు, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, మినీ అంగన్వాడీ, డ్రైనేజీ పనుల మంజూరుకు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.