GDWL: గట్టు మండలం అంతంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను నీతి ఆయోగ్ సెంట్రల్ టీం అధికారి యోగేంద్ర ఛటర్జీ సందర్శించారు. పాఠశాలలో పారిశుద్ధ్యం, బాలికల మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చెన్నయ్య, హెచ్ఎం రంగన్న, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.