పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణరావు, కలెక్టర్ శ్రీహర్ష పాల్గొన్నారు. మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స పొందవచ్చన్నారు.