జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నపూర్ గ్రామంలో దమ్మ తిరుపతి అనే వ్యక్తిపై గ్రామ సర్పంచ్ అతని అనుచరులు జరిపిన అమానుష దాడిని ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఎమ్మార్పీఎస్ నేతలు పరామర్శించి, ధైర్యం చెప్పారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.