VKB: బషీరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్సు షెల్టర్ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. దీనిని వాడకపోవడంతో ప్రయాణికులు ఎండలో రోడ్డుపైనే బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాల ముందు తలదాచుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.