SRD: న్యాల్కల్ మండలం ముంగి గ్రామ శివారులో నిమ్జ్ ప్రాజెక్టుకు సంబంధించిన సరిహద్దు రాళ్లను శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ ఏర్పాట్లు జరిగాయి. నిమ్జ్ ప్రాజెక్టు మౌలిక వసతుల కల్పన కోసం సంబంధిత అధికారులు సరిహద్దు రాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అయితే గురువారం ఈ ప్రక్రియ చేపడుతుండగా రైతులు మహిళలు అడ్డుకోవడంతో, పోలీస్ భద్రతతో పనులు చేపడుతున్నారు.