ATP: అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడును ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై వినతిపత్రం అందజేశారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల మెటీరియల్ అందుబాటులోకి తేవాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించి నిధుల కేటాయింపునకు హామీ ఇచ్చారు.