SKLM: పలాస నూతన రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఇటీవల విధుల్లో చేరిన అప్పలరాజును పట్టణ ముఖ్య నాయకులు శుక్రవారం కలిశారు. పట్టణంలో తీవ్రమైన సమస్యగా మారిన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.