TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఫిబ్రవరి 15 నుంచి 23వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలలో విశేషమైన సేవలను అందించిన స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలక మండల సభ్యులు కొప్పెర్ల నాగరాజు, స్కౌట్ అండ్ గైడ్ సభ్యులు పాల్గొన్నారు.