PPM: నీలకంఠాపురం పోలీస్ స్టేషన్లో శుక్రవారం విద్యార్థినుల కోసం “ఓపెన్ హౌస్ ప్రోగ్రాం” నిర్వహించారు. ఈనెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎస్సై ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని విద్యార్థినులకు అవగాహన కల్పించారు.