RR: సివిల్ సర్వీసెస్లో షాద్నగర్ పట్టణానికి చెందిన ఇంద్రార్చిత సత్తా చాటింది. గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆమె 739వ ర్యాంకు సాధించగా.. ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో 627వ ర్యాంకు సాధించింది. చిన్ననాటి నుంచే సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి చదివిన ఆమె పట్టుదలతో ఈ విజయం సాధించింది.