KNR: చొప్పదండి వ్యవసాయ సహకార సంఘం 75వ సర్వసభ్య సమావేశం పర్సన్ ఇంఛార్జ్ కే. జమునరాణి అధ్యక్షతన జరిగింది. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని, లేనిపక్షంలో సహకార చట్టం ప్రకారం వసూలు చేస్తామని ఆమె హెచ్చరించారు. 2026-27 బడ్జెట్ను సభ ఆమోదించగా, సీఈవో కళ్లెం తిరుపతి రెడ్డి వార్షిక నివేదికను చదివి వినిపించారు.