KMR: జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఎండల తీవ్రతకు కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ రూ.380 నుంచి రూ.390 వరకు పలుకుతుండగా, విత్ స్కిన్ ధర రూ.350 నుంచి రూ.360కి చేరింది. లైవ్ కోడిని కిలో రూ.240 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.