తెలుగుదేశం పార్టీ ఇవాళ 43 ఏళ్లు పూర్తిచేసుకుని, 44వ వసంతంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో పార్టీకి 4 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న కార్యకర్తలకు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు.