JGL: గొల్లపల్లి నల్లగుట్ట ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా రేషన్ షాప్ కోసం ప్రజలు పడుతున్న నిరీక్షణకు తెరపడింది. రేషన్ సరుకులు తీసుకోవడానికి 2 కి.మీ. పైగా నడవవలసి వస్తుండేది. ఉప సర్పంచ్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్కు డిసెంబర్ 30, 2025లో విన్నవించగా స్పందించిన మంత్రి 400 రేషన్ కార్డులతో ప్రజలకు అందుబాటులో సబ్ రేషన్ షాపును మంజూరు చేశారు.