WNP: గోపాల్పేట మండల కేంద్రంలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నిత్య ఆరాధన, సుందరకాండ హోమం, ప్రసాద వినియోగం నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు రథోత్సవం జరుగుతుందని అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.