జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి, గొల్లపల్లె గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు, గ్రామస్థులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వంజరిపల్లి శివారులో స్థల సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో మాట్లాడి గ్రామాల మధ్య సరిహద్దు సమస్య పరిష్కరిస్తానన్నారు.