KNR: సైదాపూర్ మండలంలోని సోమారం పరిధిలోని బూడిదిపల్లిలో అంగన్వాడీ కేంద్రం స్లాబ్ నిర్మాణ పనులకు ఆదివారం పునాది పడింది. సర్పంచ్ కందుల అనిత, ఉప సర్పంచ్ వీరగోని సదానందం ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. నాణ్యతతో గడువులోగా భవనాన్ని పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏఈ మాజిద్ హుస్సేన్ పాల్గొన్నారు.