NTR: చందర్లపాడు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చింతలపాడు గ్రామానికి చెందిన వెంకటపతి(80) తన ఇంటి వరండాలో రక్తపు మడుగులో మృతిచెంది కనిపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతణ్ని దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘననా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.