NRPT: ఊట్కూరు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నాల్గో వార్డ్ మెంబర్ ఎరుకల చిన్నకర్రె బాలప్ప శనివారం గుండెపోటుతో మృతిచెందాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. బాలప్ప మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.