NLR: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వారిపై శనివారం వేదయపాలెం పోలీసులు దాడి చేసి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని దొంతాలి క్రాస్ రోడ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డొంకరాయి ప్రాంతం నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.