ATP: ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధుల రెన్యూవల్ (FCRA) పునరుద్ధరిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చొరవతో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించామన్నారు. ఆరు దశాబ్దాలుగా పేదలకు సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఈ నిధులు ఎంతో అవసరమన్నారు.