WGL: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ కోసం భద్రతా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రంగానాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఒక్కో పాఠశాలకు రూ.500 చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 2,543 పాఠశాలలకు మొత్తం రూ.12,66,500 విడుదల చేసినట్లు వెల్లడించారు. పాఠశాల గోడలపై అధికారుల ఫోన్ నెంబర్లు ఉండే విధంగా రాసి ఉంచాలని సూచించారు.