KMR: గాంధారి మండలం రాంపూర్ గడ్డ శివారులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలు లాలీటూమ్ కుమార్ (27), నరేష్ కుమార్ (30), రాహుల్ (20) బైక్పై వెళ్తుండగా, అతివేగంతో రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బీహార్, ఉత్తరప్రదేశ్ కూలీలుగా గుర్తించారు.