HYD: నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. బుల్లెట్ రైలు హబ్ ఏర్పాటుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో 500 నుంచి 600 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరానికి అంతర్జాతీయ స్థాయి రవాణా సదుపాయాలు కలుగుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.