NLR: కందుకూరులోని సింహాద్రి నగర్‌కు చెందిన జంపాల వెంకటరమణయ్య, ఒంగోలు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో వాహనం స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.