దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య అండర్-20 ఛాంపియన్షిప్లో లీగ్ దశను భారత్ అగ్రస్థానంతో ముగించింది. బంగ్లాదేశ్తో మ్యాచ్ను 1-1తో డ్రా చేసుకుంది. విశాల్ యాదవ్ గోల్ కొట్టి భారత్కు ఆధిక్యం అందించాడు. మహ్మద్ రియాద్ స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. బుధవారం సెమీఫైనల్లో భారత్తో భూటాన్, బంగ్లాతో నేపాల్ తలపడనున్నాయి.