JGL: మెట్పల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రధాన బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పడుతున్న రద్దీని తగ్గించేందుకు మున్సిపల్, ఆర్టీసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.