KMM: ముదిగొండ మండలంలోని సువర్ణపురం స్టేజీ వద్ద శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి చిరుమర్రి వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి సమీపంలోని పంట పొలంలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.