చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, అపోలో బ్లాక్లో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు.