బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డే, మృణాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఈ ఇద్దరు నాయికల కాంబోలో ఓ సాంగ్ రాబోతున్నట్లు సమాచారం. వీరిద్దరి ప్రత్యేక స్టెప్పులతో ప్రేక్షకులను అలరించేలా ఈ పాట ఉంటుందట. ఈ రొమాంటిక్ డ్రామా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.