MBNR: కోయిలకొండ మండలం గంగ్యా నాయక్ తండాకు చెందిన ముడావత్ శివను కాంగ్రెస్ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అండర్-14, సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో శివ ప్రతిభ కనబరిచినందుకు అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో మరిన్ని శిఖరాలు అధిరోహించి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.