TPT: పద్మావతి మహిళా డిగ్రీ & PG కళాశాల విద్యార్థినులు MITS మదనపల్లిలో జరిగిన జాతీయ స్థాయి ఫెస్ట్‌లో వాలీబాల్‌లో మొదటి స్థానం సాధించారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్లు, రూ. 6,000 బహుమతి లభించింది. ప్రిన్సిపల్ డా. నారాయణమ్మ విద్యార్థినులను అభినందించారు. చదువులోనే కాదు క్రీడల్లో కూడా ప్రతిభ చూపి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు.