ATP: గుత్తిలో ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ADJ సాదుబాబు, సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ్ చారి, జూనియర్ సివిల్ జడ్జి మంజుల తెలిపారు. ఇవాళ ఏడీజే కోర్టులో బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ఈ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.