NTR: ఇబ్రహీంపట్నం తహశీల్దార్‌పై రైతులు, కూటమి నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టదారు పాసుపుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తహశీల్దార్ కార్యాలయం ముందు PACS ఛైర్మన్ గరికపాటి శ్రీనివాసరావు, మూలపాడు రైతులు నిరసనకు దిగారు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్, వీఆర్డీ నరేంద్ర పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.