సత్యసాయి: కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాలలలో జరుగుతున్న పరీక్షలను CC కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలో మొత్తం 42 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 7265 మందికి గాను 6960 హాజరై, 305 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు.