VSP: జీవీఎంసీ 13వ వార్డు ఆరిలోవలో శానిటేషన్ వర్కర్లకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఇచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చ రామురెడ్డి, మహిళల కోఆర్డినేటర్ ఎం. నాగలక్ష్మి పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల నైపుణ్యాల పెంపు, తడి-పొడి చెత్త వేరు చేయడం, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు.