TG: మాదిగ ఎంప్లాయిస్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ను అమలుచేసినందుకు గానూ.. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్సీలు పైకి రావడానికి సబ్ ప్లాన్ కీలకమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు.