2026 టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పిచ్ క్యూరేటర్లపై విపరీతమైన ఒత్తిడి ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. మెగా టోర్నీ కోసం నాణ్యమైన పిచ్‌లను సిద్ధం చేయడం సవాలుతో కూడుకున్న పని అని ఆయన పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా వికెట్లు రూపొందించడంలో క్యూరేటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని మోర్కెల్ అభిప్రాయపడ్డాడు.