MDK: బీహార్ నుంచి అల్లాదుర్గం మండలానికి తరలిస్తున్న అక్రమ బియ్యం లారీను అల్లాదుర్గం పోలీసులు పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల నుంచి దొడ్డు రకం బియ్యం లారీల్లో రవాణా చేస్తూ మండలంలోని శ్రీ సాయి బిన్నీ రైస్ మిల్కు తరలిస్తుండగా పట్టుకొని స్థానిక స్టేషన్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం సుమారు 42 టన్నుల వరకు ఉందని పోలీసులు తెలిపారు.