Tenth Exams: రేపటి నుంచి టెన్త్ స్పాట్ వాల్యుయేషన్
టెన్త్ మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తికావడంతో గురువారం నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 18 సెంటర్లలో 21వ తేదీ వరకు వాల్యుయేషన్ కొనసాగనున్నట్లు వెల్లడించారు.
Tenth Exams: పలు ఉద్రిక్త క్షణాల నడుమ ఈ ఏడాది టెన్త్ పరీక్షలు(Tenth Exams) రాష్ట్రంలో ముగిశాయి. మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు ముగియడంతో ఇంతకాలం హాస్టల్స్ లో ఉన్న స్టూడెంట్లు ఇంటికి పయనమయ్యారు. దీంతో బస్టాండ్లు(Bus Stand), రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. టెన్త్ మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తికావడంతో గురువారం నుంచి స్పాట్ వాల్యుయేషన్(spot valuation) ప్రక్రియ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 18 సెంటర్లలో 21వ తేదీ వరకు వాల్యుయేషన్ కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఈసారి కొత్తగా మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి, మేడ్చల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వాల్యుయేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షల్లో 16 మంది స్టూడెంట్లపై మాల్ ప్రాక్టీస్(Mall practice) కేసులు నమోదయ్యాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు ఇన్విజిలేటర్లను సర్వీస్ నుంచి రిమూవ్ చేయగా, మరో ఇద్దరు ఇన్విజిలేటర్లను, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిపార్ట్ మెంట్ల్ ఆఫీసర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
చదవండి : IPL Cricket Betting బెట్టింగుల భారీ ముఠా అరెస్ట్.. రూ.కోట్లలో దందా
స్పాట్ వాల్యుయేషన్ నిర్వహణకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన స్టేట్ అబ్జర్వర్లను నియమించారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డికి, హైదరాబాద్, సంగారెడ్డి సెంటర్లు.. గురుకుల సొసైటీ సెక్రటరీ రమణకుమార్కు నల్లొండ, యాదాద్రి.. అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉషారాణికి రంగారెడ్డి(Rangareddy), మేడ్చల్.. సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయికి వరంగల్.. టెస్ట్ బుక్ ప్రెస్ డైరెక్టర్ శ్రీనివాస్చారికి ఖమ్మం.. ఓపెన్ స్కూల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డికి కరీంనగర్, సిద్దిపేట, వరంగల్.. ఆర్జేడీ సత్యనారాయణరెడ్డికి ఆదిలాబాద్, నిర్మల్.. డైరెక్టరేట్ జేడీ మదన్ మోదన్కు నిజామాబాద్ (Nizamabad).. ఐఏఎస్ఈ ప్రిన్సిపల్ ఉషారాణికి మంచిర్యాల, జగిత్యాల.. ఎస్ఎస్ఏజేడీ వెంకటనర్సమ్మకు నాగర్ కర్నూల్, హైదరాబాద్(Hyderabad).. ఆర్జేడీ విజయలక్ష్మీకి మహబూబ్ నగర్ సెంటర్లకు అబ్జర్వర్లుగా బాధ్యతలు అప్పగించారు.