బాపట్ల: సముద్ర తాబేళ్ల సంరక్షణకు మరో ముందడుగు పడింది. శుక్రవారం ఉదయం రామాపురం బీచ్లో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. ప్రకృతి సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు.