విజయ్ సేతుపతి హీరోగా, సంజయ్ దత్ విలన్‌గా ఒక క్రేజీ కాంబినేషన్ తెరకెక్కబోతున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇక కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.