KRNL: జిల్లాలో పక్కా గృహాల లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి ఇవాళ ‘ఫోన్-ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ పీడీ టి.చిరంజీవి ఓ ప్రకటనలో తెలిపారు. నిర్మాణ సామగ్రి కొరత, బిల్లుల పెండింగ్, పీఎంఏవై 2.0 అర్బన్ గృహాలకు సంబంధించిన సందేహాలపై ఇవాళ ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య 08518-257481 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు.