తమిళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. మే 2న తమిళనాడులో సినిమా షూటింగ్ల బంద్కు పిలుపునిచ్చింది. ఇకపై నటీనటులకు పారితోషకం బదులు లాభాల్లో వాటా(Revenue Share) ఇవ్వాలని ప్రతిపాదించింది. టాలీవుడ్ తరహాలో నిర్మాణాల్లో మార్పులు తేవాలని నిర్ణయించింది. కొన్ని ఓటీటీ సంస్థలు నిర్మాతలను బెదిరిస్తున్నాయని మండలి తీవ్ర ఆరోపణలు చేసింది.