WGL: వరంగల్‌కు చెందిన ప్రవీణ్ కుమార్‌పై మోసపూరిత వివాహాల ఆరోపణలు వెలుగుచూశాయి. బాన్సువాడకు చెందిన అతడి భార్య (బాధితురాలు) తెలిపిన వివరాల ప్రకారం, ఉద్యోగినులను లక్ష్యంగా చేసుకుని వివాహం పేరుతో మోసం చేస్తున్నాడని, ఇప్పటివరకు ఏడుగురిని మోసం చేసినట్లు ఆరోపించింది. ఈ నెల 6న గర్భిణీ అయిన ఆమెపై దాడి చేసి 4 తులాల బంగారం, నగదుతో పరారైనట్లు వాపోయింది.