TG: MP మల్లు రవి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీలో పాలకుర్తి నియోజకవర్గ ఫిర్యాదులపై చర్చించారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన హరిప్రసాద్, కిషోర్ రెడ్డిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిపై ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీలో ఏవైనా సమస్యలుంటే పీసీసీ దృష్టికి తీసుకురావాలని, బహిరంగంగా విమర్శలు చేయవద్దని MP నేతలను హెచ్చరించారు.