KRNL: వేసవిని దృష్టిలో ఉంచుకుని పెద్దకడబూరు గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చెడిపోయిన బోర్‌కు టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు సొసైటీ ఛైర్మన్ మీ సేవ ఆంజనేయులు ఆదివారం మరమ్మతులు చేయించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనయే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.