BDK: ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యురాలు మహిళా న్యాయవాది సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగపూర్లో జరిగిన జాతీయ మహాసభలో ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ను ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు.